Repository files navigation Telugu Translation Style Guide for WordPress.org
Retain the punctuation marks from the original English string into Telugu.
Do not put a space before full stop, comma, question mark, exclamation mark, colon, and semi colon.
Do not use double spaces.
Do not leave spaces or new lines at the end of the translated phrase..
Do not translate placeholders like %1$s, %s, %d, etc.
వాక్య నిర్మాణమూ పదాల క్రమమూ తెలుగుకి సహజంగా ఉండాలి. ఉదా॥ అన్ని టపాలను vs. టపాలన్నీ .
వాడుకరి కంప్యూటరుకి ఇచ్చే ఆదేశాలను ఏకవచనంలో వ్రాయాలి.
కంప్యూటరు/మెషిన్ వాడుకరికి ఇచ్చే సూచనలూ, అడిగే ప్రశ్నలనూ గౌరవవచనంలో వ్రాయాలి.
సైటుని చూడండి
నిజంగానే ఈ టపా తొలగించాలనుకుంటున్నారా?
వర్డ్‌ప్రెస్ సంబంధిత పదాలకు అనువాద వేదికలో ఉన్న పదకోశాన్ని చూడండి.
సాధ్యమైనంత వరకూ అచ్చ తెలుగు పదాలను, ప్రస్తుతం వాడుకలో ఉన్న పదాలనే ఎంచుకోవాలి.
ఆంగ్ల పదాలకు సరైన తెలుగు పదాలు లేకపోతే, ఆంగ్ల పదాన్నే తెలుగు లిపిలో వ్రాయవచ్చు. అవి తెలుగు మాటలుగా విన/కనబడేందుకు వాటిని ఉకారంతో ముగించండి.
ఇందువల్ల బహువచన రూపాలు కూడా తెలుగు మాటలుగా సహజంగా ఉంటాయి.
సైట్లు vs సైట్‌లు or సైట్ లు
ఫైళ్ళు vs ఫైల్‌లు
ఈ పదాలు ప్రత్యయాలతో (ను, కి, తో వంటి వెనుజేర్పులతో) వచ్చినప్పుడు, వెనుజేర్పులు పదంలో సహజంగా కలిసిపోవాలి.
ప్లగిన్లను vs ప్లగిన్ లను
ట్యాగుని vs ట్యాగ్ ని
ఈ రోజుల్లో నామవాచకాల చివర ము బదులు సున్నా కని/వినిపిస్తూంది. మనమూ అలానే వ్రాద్దాం.
వర్గం vs వర్గము
వర్గాన్ని vs వర్గమును
క్రియా పదాలను కూడా ఆధునిక రూపాల్లోనే వ్రాయండి.
ఆదేశాలు : తొలగించు vs తొలగించుము
విన్నపాలు : టపాను చూడండి vs టపాను చూడుము
క్రియా విశేషణ పదాలు, విభక్తులను కూడా నేడు వాడుకలో ఉన్న విధంగా వ్రాయండి.
కంప్యూటర్లో vs కంప్యూటర్ నందు
ఫైలులో /ఫైలుకి vs ఫైలునకు
About
Telugu Translation Style Guide for WordPress.org
Resources
License
Stars
Watchers
Forks
You can’t perform that action at this time.